ఒక రెండు వారల క్రింద ఇక్కడ అంటే అమెరికా లో పాల సముద్రం లా అందమైన మంచు పొర కప్పుకొని వుంది . . . నా బ్లాగ్ లో ఆ ఫోటోలు చూసే వుంటారు.. రెండే రెండు వారాల్లో ఇక్కడి పరిస్థితి అంతా మారిపోయింది... మంచు లో ఆకులు అన్ని రాలిపోయి మోడుబారిపోయిన చెట్లు ఇప్పుడు పచ్చని చిగుర్లు తోడుగుతున్నాయి... నిర్జీవంగా మాడిపోయిన చేట్లోంచి ఎక్కడినుంచో ప్రాణం తన్నుకొని చిగుర్లలా వస్తున్నాయి ... ఈ రోజు ఉదయం వాతావరణం ఎంత ఆహ్లాదకరంగా వుందో ఈ ఫోటోలు చుడండి... అసలు సినిమాల్లో పుస్తకాల్లో, లేదా ఏ ఊటీ లో నో షిమ్లా లో నో చూసి వుంటారు... అసలు ఏదో తెలియని ఆనందం కలిగింది నాకు వాటిని చూడగానే... అసలు నా మనసు తనువూ పులకరించి పోయాయి.... ఆఫీసు లో పని చేస్తూ చేస్తూ మాటి మాటికి విరామం తీసుకొని బయటకు వచ్చి ఆ అందమైన సరస్సు, అందులో ఈదుతున్న బాతుల్లాంటి పక్షులు ... చిగుర్లకు చివర్లలోని చినుకులు ... ఊడల లా వేలాడుతున్న లతలు చూస్తే ...ఆహ... స్వర్గం లా అనిపించింది.... ఎంతో సంతోషం కలిగింది .....నేను ఇక్కడకు వచ్చిన దానికి ఫలితం దక్కినట్టు గా అనిపించింది...
చిన్న చిన్న విషయాలైన ఎంత ఆనందాన్ని కలిగిస్తాయి ... జీవితానికి పాఠాలు కూడా నేర్పిస్తాయి .. శీతాకాలం లో మోడైపోయిన చెట్లు మల్లి ఎలా చిగురించాయో... జీవితంలో కూడా కష్టాల తరువాత సుఖాలు ఉంటాయి అని చెప్పకనే చెపుతున్నాయి..
సిరివెన్నల సీతారామాశాస్త్రి గారి 'ఈ గాలి ఈ వేలా సెలయెరూ' పాట నా మొబైల్ ఫోన్ లో వింటూ విహరిస్తూ ఈ ఫోటోలు తీసాను... ఆహా... ప్రకృతి కంత ఎంత అందం ముందు ఎంత అందమైన దిగదుడుపే అనిపించింది..
 |
మబ్బులతో నిండిన ఆకాశం ఎన్ని చిలిపి ఆశలు కలిగిస్తుందో
See the sky covered with clouds.. how romantic.. |
 |
అసలు వేలాడుతున్న ఈ వృక్షాన్ని చుడండి...
See this tree..which has these lovely hanging leaves... |
 |
ఈ సెలయేటిని చూడండి...ఎంత తృప్తి గా శాంతంగా ఉందొ
See how peaceful the lake is... |
 |
ఇలాంటి చల్లని వాతావరణం లో ఒక లాంగ్ డ్రైవ్ ... ప్రేయసి తో ..
Imagine a long drive in this weather with your loved one.. |
 |
వర్షపు ముత్యాలు... ఆహా
Pearls of raindrops...Wow |
అలా ఆఫీసు కి వెళ్లి వచ్చా... మల్లి రాత్రి ఫోన్ లో నా ప్రియురాలితో తో మాట్లాడుతున్నప్పుడు అలా చెట్లలో విహరిస్తున్న.. చల్లగా మలయ మరుతలు వీస్తున్నాయి... ఆహా ఎంతటి అదృష్టమో అనుకుంటూ ఉన్న.. అంతలో చినుకులు రాలడం మొదల్లయ్యాయి ... నా ముఖాన్ని వర్షం వైపు తిప్పీ... ఆ చిరుజల్లు లో తడిసి పులకించిపోయా... అలా తడుస్తుంటే సంతోషం తన్నుకువస్తుంటే... అప్పుడే ఈ పోస్ట్ కి రూపం వచ్చింది... నన్ను నేను ఆపుకోలేక పోయా... నా నోటివెంట పాటలు అలా వచ్చేసాయి ...
ఒహొహొహొహొహ్ఒహోఒ... పాదమెటు పోతున్న పయనమెందాకైన ... అడుగుతదబడుతున్న.. నేను లేనా... ఒంటరైనా ఓటమయినా.. ఒహ్హ్హ. మై ఫ్రెండ్... తడి కన్నులనే తుడిచిన నేస్తమా... అని తనివి తీరా పడేసా...
నిన్న చూసి వెన్నెలే అనుకున్న.. మొన్న కూడా నిన్నలా కలగన్నా.. అడుగేటు పడుతున్నా .. తనవైపెలుతున్నా... కునుకయినా రాని సమయాన.. కనుమూస్తే చాలు తమరేనా.. పెనవేసుకున్న ప్రనయమున..యమునా తీరేనా...
................................................................................................
హ్యాపీ డేస్... హ్యాపీ డేస్...
వావ్... జీవితం ఎంత అందంగా ఉంది...!!!